
ఫీల్డ్ అసిస్టెంట్ హత్యకు గురి కావడం బాధాకరమైన విషయం: మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
పయనించే సూర్యుడు, జనవరి 26, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ:- ఆలూరు నియోజకవర్గంలోని అరికెర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ హత్యకు గురి కావడం చాలా బాధాకరమైన విషయమని శనివారము ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హత్య రాజకీయాలు మంచివి కాదని ఫీల్డ్ అసిస్టెంట్ హత్య చేయడం చాలా బాధాకరమని, చెప్పినట్లు చేయకపోతే చంపడం కూటమి ప్రభుత్వం నిదర్శనమని తెలిపారు. పోలీస్ శాఖ దుండగులుని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. గత ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఎన్నడు జరగలేదని, స్థానిక కొంతమంది రాజకీయ పార్టీ అండదండలతో హత్య చేశారని ఆరోపణలు వస్తున్నాయని , ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హత్య రాజకీయాలు మంచివి కావాలి,
మానుకోవాలని తెలియజేసారు. వైయస్ఆర్ సీపీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి ఆదుకుంటామని జిల్లా నాయకులందరూ కలిసి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సంఘటన గురించి కర్నూలు ఎంపీ స్పందించాలన్నారు. కొన్ని కారణాల వల్ల సంఘటన స్థలానికి చేరలేకపోయానని ఏదైనాప్పటికీ కుటుంబానికి తోడుగా ఉంటామని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆదోని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు.