పయనించే సూర్యుడు జనవరి 26 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- తెలుగు రాష్ట్ర ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పద్మ శ్రీ పద్మ విభూషణ్ పురస్కారాలను పొందుతున్న తెలుగు వారందరికీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం బీసీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు తెల్ల హరికృష్ణ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు, అదేవిధంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలియజేశారు, ఆదివారం ఉదయం పది గంటలకు కూకట్పల్లి వై జంక్షన్ లోగల అంబేద్కర్ విగ్రహం దగ్గర మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోని పలు బీసీ సంఘాల నాయకులతో కలసి సమావేశం ఏర్పాటు చేసి గత యాభై సంవత్సరాలుగా రాజ్యసభ సభ్యులైన ఆర్ కృష్ణయ్య బడుగు బలహీన వర్గాలైన బీసీల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి నిరంతరం బీసీల కోసం చేస్తున్న పోరాటాన్ని గ్రహించి వారికి కూడా పద్మ విభూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించాలని కోరడం జరిగింది, వారితో పాటు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఓ బి సి వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్, తెలంగాణ బీసీ వికాస్ సమితి రాష్ట్ర అధ్యక్షులు బాశెట్టి నర్సింగరావు, శేర్లింగంపల్లి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పుట్ట శివశంకర్, టి పి సి సి లేబర్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ సోషల్ మీడియ కూకట్ పల్లి నియోజకవర్గ ప్రెసిడెంట్ సప్పిడి భాస్కర్, ఆల్విన్ కాలనీ డివిజన్ బీసీ సీనియర్ సీనియర్ నాయకులు పట్వారి శశిధర్, మరియు జిల్లా, నియోజకవర్గ, డివిజన్లా బీసీ నాయకులు తోట సత్యనారాయణ, దూలక్ నర్సింగ్, రాజు, కొట్టే వీరస్వామి, మహేష్, సురేష్ కుమార్, ఐ వెంకట నరసింహారావు, శ్రీకాంత్, పుట్ట సాయి, సిహెచ్ నరహరి, యాదగిరి తాడ్, అవినాష్, టింకు, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ కృష్ణయ్యకు పద్మ విభూషణ్ అవార్డుని ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.*
పద్మ శ్రీ పద్మ విభూషణ్ పురస్కారాలను పొందుతున్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన తెల్ల హరికృష్ణ
RELATED ARTICLES