డీజేఎఫ్ రాష్ట్ర మహాసభ విజయవంతం. పయనించే సూర్యుడు న్యూస్ మందమరి మండల రిపోర్టర్, (బొద్దుల భూమయ్య) జనవరి 26
రాష్ట్రం నలుమూలలనుంచి తరలివచ్చిన జర్నలిస్టులు
జర్నలిస్టుల హక్కుల సాధనలో డీజేఎఫ్ ది అలుపెరగని పోరాటం
పాత్రికేయులందరికీ ఇండ్ల స్థలాలిచ్చేదాక విశ్రమించం
ఎలాంటి వివక్షత లేకుండా జర్నలిస్టులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి.
డీజేఎఫ్ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి,
డీజేఎఫ్ జాతీయ ప్రధానకార్యదర్శిగా బండారి మారుతి నియామకం
డీజేఎఫ్‌ని జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తాం : జాతీయ గౌరవాధ్యక్షులు పి.విశ్వనాథ్
జర్నలిస్టుల హక్కుల కోసం త్వరలో పోరుబాట : రాష్ట్ర అధ్యక్షులు మోటపలుకుల వెంకట్,
జర్నలిస్టుల హక్కుల సాధనలో డీజేఎఫ్‌ది అలుపెరగని పోరాటమని డీజేఎఫ్ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణా రెడ్డి అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ మీడియాలు,యూనియన్లకు అతీతంగా అన్ని ప్రభుత్వ సంక్షేమ ఫలాలు దక్కేదాక విశ్రమించబోమన్నారు.అక్రిడేషన్లతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతీ పాత్రికేయుడికి ఇండ్ల జాగలు ఇవ్వాల్సిందేనన్నారు.శుక్రవారం హన్మకొండలోని శారదా పంక్షన్ హాల్‌లో నిర్వహించిన డీజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన డీజేఎఫ్ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ..జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిఖార్సుగా నిరంతరం పనిచేస్తున్న డీజేఎఫ్ అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు ఉండి అతిపెద్ద జర్నలిస్టు సంఘంగా అవతరించడం గర్వకారణమన్నారు.ఏ రాజకీయ పక్షానికి కొమ్ముకాయకుండా ఎళ్లవేళలా జర్నలిస్టుల పక్షాన నిలుస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండటంతో నేడు డీజేఎఫ్‌కి జర్నలిస్టు వర్గాల్లో మంచి గుర్తింపు దక్కిందన్నారు.జర్నలిస్టులకు రక్షణ,వృత్తిలో శిక్షణ,సంక్షేమమే డీజేఎఫ్ ముఖ్య ధ్యేయమన్నారు.రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా డీజేఎఫ్ కార్యకలాపాలను విస్తరిస్తామన్నారు. డీజేఎఫ్ జాతీయ గౌరవాధ్యక్షులు పి.విశ్వనాథ్ మాట్లాడుతూ..జర్నలిస్టుల గొంతుకగా డీజేఎఫ్ నిరంతరం శ్రమిస్తోందన్నారు.త్వరలోనే డీజేఎఫ్ జాతీయ మహాసభను ఏపీలోని విజయవాడలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. డీజేఎఫ్ జాతీయ ప్రధానకార్యదర్శిగా నియమితులైన బండారి మారుతి మాట్లాడుతూ…డీజేఎఫ్‌ని జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు.జర్నలిస్టుల సంక్షేమం కోసం డీజేఎఫ్ పక్షాన గట్టిగా కొట్లాడుతామన్నారు.డీజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మోటపలుకుల వెంకట్ మాట్లాడుతూ..వర్కింగ్ జర్నలిస్టులందరికీ అన్ని ప్రభుత్వ రాయితీలు,సంక్షేమ పథకాలు అందించడానికి నిరంతరం డీజేఎఫ్ పోరాడుతోందన్నారు.రానున్న రోజుల్లో ప్రభుత్వం మీద దశలవారిగా వత్తిడి తీసుకొచ్చి జర్నలిస్టులకు ఇండ్ల జాగలను సాధిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో డీజేఎఫ్‌కి చెందిన పలువురు రాష్ట్ర,జిల్లా బాధ్యులు ప్రసంగించారు.జర్నలిస్టులందరికీ ఎలాంటి వివక్ష చూపకుండా ఇండ్ల జాగలతోపాటు ఇతర పథకాలను వర్తింపచేయాలని డీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మోటపలుకుల వెంకట్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులంతా బలపరిచారు.ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ జాతీయ కార్యదర్శి సబ్బితం లక్ష్మణ్, డీజేఎఫ్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కోలా శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.గోపాల్‌రెడ్డి, క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ మల్లయ్య మహర్శి,ఉత్తర తెలంగాణ రీజినల్ కో ఆర్డినేటర్ పార్వతి రాజిరెడ్డి,జెపిఎఫ్ కన్వీనర్ చింతకింది సింగరయ్య,మహిళా నాయకురాల్లు గీత,సాగంటి మంజుల,రాష్ట్ర కార్యదర్శులు,ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు,వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, నాయకులు,సభ్యులు పాల్గొని ప్రసంగించారు.
డీజేఎఫ్ జాతీయ ప్రధానకార్యదర్శిగా బండారి మారుతి డీజేఎఫ్ జాతీయ ప్రధానకార్యదర్శిగా ఎస్కార్కే మీడియా గ్రూపు సంస్థల ఛైర్మెన్ బండారి మారుతి నియమితులయ్యారు.హన్మకొండలో నిర్వహించిన డీజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర మహాసభలో ఈ మేరకు డీజేఎఫ్ జాతీయ కమిటీ నియామక ప్రకటన చేశారు. అనంతరం డీజేఎఫ్ జాతీయ ప్రధానకార్యదర్శిగా నియమితులైన బండారి మారుతి మాట్లాడుతూ డీజేఎఫ్ జాతీయ నాయకత్వం తనమీద పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా అవిశ్రాంతంగా జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడతానన్నారు.రానున్న రోజుల్లో డీజేఎఫ్‌ని జాతీయస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు.ఓరుగల్లుకు తరలిన జర్నలిస్టు లు. బొద్దుల భూమయ్య మందమరి మండలం కోశాధికారి, ఆశీర్వల్సన్ రిపోర్టర్, తవుటమ్ సుధాకర్ రిపోర్టర్, లు పోరుగడ్డ ఓరుగల్లు డీజేఎఫ్ సభ్యులతో నినాదాలతో దద్దరిల్లింది.శుక్రవారం హన్మకొండలో నిర్వహించిన డీజేఎఫ్ రాష్ట్ర మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచి పాత్రికేయులు అధికసంఖ్యలో హాజరయ్యారు.జర్నలిస్టుల హక్కుల సాధనలో అవిశ్రాంత పోరుబాట పట్టిన డీజేఎఫ్‌కి పాత్రికేయులు బ్రహ్మరథం పట్టారు.ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా జర్నలిస్టుందరికి ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రాయితీలు,సంక్షేమ ఫలాలు,ఇండ్ల జాగలు అందాలనే లక్ష్యంతో డీజేఎఫ్ నిజాయితీగా,నిఖార్సుగా ప్రభుత్వాలతో కొట్లాడుతూ వస్తోంది.ఈ క్రమంలో గత ఐదేండ్లుగా అనేక భారీ సభల నిర్వహణతోపాటు పాదయాత్రలు,నిరసన కార్యక్రమాలు చేపడుతూ జర్నలిస్టుల్లో మంచి ఆదరాభిమానాలు సంపాదించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఓరుగల్లు సభతో మరోసారి డీజేఎఫ్ తన సత్తా చాటింది.జర్నలిస్టు యూనియన్లు ఎన్ని ఉన్నా డీజేఎఫ్ తన ప్రత్యేకతను, మరోమారు తన పట్టును నిరూపించిందని పాత్రికేయ వర్గాలు అభిప్రాయపడటం విశేషం……
దద్దరిల్లిన డీజేఎఫ్ ఓరుగల్లు మహాసభ.
RELATED ARTICLES