నారాయణఖేడ్ నియోజకవర్గంలో పయనించే సూర్యుడు దస్తగిరి రిపోర్టర్26-1-2024:- సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల అబుల్ కలాం ఆజాద్ చౌక్ లో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ కలాం ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నారాయణఖేడ్ కరస్గుత్తి వెళ్లే దారిలో 2014 నుండి ప్రతి సంవత్సరం జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ వై సి ప్రెసిడెంట్ ఎండి ఇమ్రాన్, ఎండి అర్మాన్, అబ్దుల్ అజీమ్, షకీలా అహ్మద్, ఎండి ఫయాజ్, అబ్దుల్, బసిద్, సయ్యద్ నుమన్, సయ్యద్ వాకర్, యువత ముస్లిం యాక్షన్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ మొయినుద్దీన్ ఖురేషి, వాజిద్, రషీద్, మజీద్, మజార్ అబు పటేల్, సయ్యద్ అక్బర్, సయ్యద్ యూనుస్, యూసుఫ్, షఫీ కురేసి, ఎండి ఇసాక్ తదితరులు ఉన్నారు.
*అబుల్ కలాం ఆజాద్ చౌక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు **
RELATED ARTICLES