
▪️50 సంవత్సరాల రిజిస్ట్రేషన్ పేపర్లు ఉండగా ధరణిలో దొంగ పహాని పుట్టించి భూ కబ్జా చేయడానికి ప్రయత్నం..
▪️భూ కబ్జాదారుడే దోరగా చలామణి..
▪️దీనికి మద్దతుగాసామాజికవేత్తల ముసుగులో మోసాలు..
పయనించే సూర్యడు /ఫిబ్రవరి //5// హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
జమ్మికుంట పట్టణంలోని కోరపల్లి రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి సర్వేనెంబర్ 464, 465,లో రిటైర్డ్ ఎంప్లాయ్ ఏనుగు జయపాల్ రెడ్డి తండ్రి భూపాల్ రెడ్డి వాయస్ 66 సంవత్సరాలు సొంత గ్రామం మర్రివానిపల్లి మండలం ఇల్లందకుంట జిల్లా కరీంనగర్ ప్రస్తుత నివాసం ఉంటున్నాడు. ఈ సందర్భంగా ఏనుగు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ…2000 సంవత్సరంలో పట్టేధార్ అయినటువంటి వడ్డేపల్లి బుచ్చి రాజలింగం తండ్రి వెంగయ్య రిటైర్డ్ టీచర్ 1953 నుండి పట్టేదారిగా ఉన్నాడన్నారు.ఇతను 1975లో యాంసానిచంద్రమౌళి, అయిత భద్రయ్య కు పట్టా చేయడం జరిగిందన్నారు .తదనంతరం 1800 గజాలు నేను ,ఏలేటి భూమిరెడ్డి మర్రివానిపల్లి,కొనుగోలు చేయడం జరిగిందన్నారు .ఇందులో నుండి దాదాపుగా 1500 గజాల అమ్మడం జరిగింది, అని అందులో 1000 గజాల వరకు ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగిందన్నారు . అందులో జూపాక ఏసురత్నం, వనపతి రెడ్డి ,చంద్రగిరి పోచాలు, సత్య ప్రకాష్ ఐస్క్రీమ్ వాళ్లు, తర్వాత చివరిలో గుండెరాజు ఆటో డ్రైవర్ ,మూవీ లింగారెడ్డి, కొత్త పెళ్లికి చెందిన ఓమ్ని రుమాన్,కొనుగోలు చేసినారన్నారు .మొత్తం 1800 గాజాలో నాకు ఉన్నటువంటి 297 చదరపు గజములు స్థలం ఉన్నదని,మిగతాది మొత్తం అమ్మడం జరిగిందన్నారు. అయితే 2004లో గుండె రాజు కు రైల్వే ట్రాక్ ప్రక్కన ఉన్న స్థలాన్ని అమ్మినటువంటి118 గజములు దగ్గర ఈ లొల్లి ప్రారంభం అయిందన్నారు.గుండె రాజును ఇల్లు కట్టనీయకుండా నాకు ఇందులోనుండి దారి ఉందని కట్టనీయకుండా మొట్టమొదలు కాటిపెల్లి రాజు అనేటువంటి అతను పోలీస్ స్టేషన్ పోయి మమ్మల్ని పిలిపించడం జరిగిందని . అట్టి సమయంలో మాకు ఉన్నటువంటి దస్తావేజులు చూయించిన తరువాత నాటి సిఐ కూడా నీ దగ్గర ఉన్న పేపర్లను తీసుకురమ్మని తెలిపినారన్నారని . కానీ అతను తీసుకురాలేదు అని తెలిపారు. తరువాత 2004 సంవత్సరంలో ఎంఆర్ఓ సంతకం పోర్జర్ చేసి ఒక పహాని పుట్టించి బుచ్చి రాజలింగం ఇతని తల్లికి అమ్మినట్టు ఒక దస్తావేజు పుట్టించి 2020 సంవత్సరం ధరణిలో 465 లో 5 గుంటలు 464లో 4 గుంటల భూమిని ఆన్లైన్లో వచ్చే విధంగా చేసుకోవడం జరిగిందన్నారు .దాదాపు 10 గుంటలు భూమి చేసుకున్నాడు, అని కానీ అక్కడ ఐదు గుంటల భూమి కూడా లేదు,రెండు గుంటల భూమి కూడా ఖాళీగా లేదు అని వివరించారు.మరి దాదాపు దీని యొక్క ఖరీదు మూడు కోట్ల రూపాయలు అవుతాయి, మరి ఇతని గత చరిత్ర చూసినట్టయితే ఇతని సొంత ఊరు కనుకుల గిద్దె ఇతని మీద హుజురాబాద్ లో పలు కేసులున్నాయన్నారు.వీణవంకలో కూడా కేసు ఉంది, అని ఇతను చేసే పని సుతారి పని, ఈ మూడు కోట్ల రూపాయల భూమి ఎలా కొన్నాడన్నారు. ఈ వడ్డపల్లి బుచ్చిరాజు లింగం అనేటువంటి వ్యక్తి 1999లో తీర్థయాత్రలకు వెళ్లి ఇ రోజు వరకు కూడా రాలేదఅన్నారు.అతను లేడు ఆచూకీ లేదు మరి ఇంటి వాళ్ళకే దొరికనటువంటి వ్యక్తి 2004లో అమ్మినట్టు ఎట్లా రాయించుకున్నారు, అని మాట్లాడారు.అలాగే అతను ఆ కాలంలోనే గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఆయన ఇంగ్లీషులో సంతకం పెట్టేవాడు, అని ఆయన సర్వీస్ బుక్కు లో గాని అతను మాకు చేసినటువంటి రిజిస్ట్రేషన్ పేపర్లలో కూడా ఇంగ్లీష్ సంతకమే పెట్టాడాన్నారు.కానీ వీళ్ళు ఒక తెలుగు సంతకం పెట్టి సాదా బయానమ, లో కూడా తండ్రి పేరు తప్పుగా రాసిండ్రు, అని ఇవన్నీ పెట్టి కోర్టులో ఇతనిదే ఒరిజినల్ డాక్యుమెంట్, నాదే అని వారే నా భూమిని కబ్జా చేస్తున్నట్టు కోర్టు పోయి ఒక పిటిషన్ వేసారన్నారు. మేము ఎమ్మార్వో దగ్గరికి పోతే ఎమ్మార్వో విచారణ జరిపి ఇది దొంగ డాక్యుమెంట్ అని నా యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి ధరణికి వచ్చే విధంగా చేశాడని, ఒక నివేదిక సమర్పించరన్నారు.దీని ఆధారంగా ఇతనిపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయి ఇప్పటికి కూడా కండిషన్ బెయిల్ పై ఉన్నాడన్నారు.ఈ సమస్య ఇలా కొనసాగుతుండగా నిన్న మొన్నటి వరకు సామాజికవేత్త ముసుగులో తిరుగుతున్నటువంటి ఎండి షాబీర్ అలీ మరియు అంబాల రాజు వీరు డబ్బులకు ఆశించి, బయటికి తీస్తే ఎంతో కొంత లాభం జరుగుతుందని లాభార్జనతోనే ఈ సామాజిక వ్యక్తుల ముసుగులో వీళ్లను బయటికి తీసుకొచ్చి అట్టి భూమిలో నిరాహార దీక్ష చేయించి ఇటు ప్రభుత్వ అధికారులపై రెవెన్యూ అధికారులపై పోలీసు వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వీరు సామాజిక వేత్త ముసుగులో చలామణి కావడానికి ఈ మార్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు .ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారాని,ఇలాంటివాల్ల ను ప్రజలు నమ్మొద్దన్నారు.తాటిపల్లి రాజు, ఇలాంటి వ్యక్తికి మీరు మద్దతిస్తూ,పాత్రికేయులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం గత 15 రోజుల నుఁడి జరుగుతుందన్నారు.కనుక ప్రతి విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని .ప్రజలారా ఇలాంటివన్నీ నమ్మొద్దని కోరుకుంటున్నాం, అన్నా రు.ఇంకా వాస్తవానికి ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి స్థలం కొత్త పెళ్లికి చెందినటువంటి ఉమెన్ ఉమ్మేరుమాన్ ఇంకా వారు కూడా స్పందించి…నిన్న పోలీస్ స్టేషన్లో బిజీయా చేయడం జరిగిందన్నారు.వీరిపై కాట్రపల్లి రాజు కాట్రపల్లి సంధ్యారాణి తాటిపల్లి లక్ష్మి అలాగే ఎండి షాబిన్ అలీ అంబాల రాజులపై నిన్న కేసు నమోదు కూడా చేయడం జరిగిందన్నారు.ప్రజలు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే మేము 50 సంవత్సరాల నుండి దాదాపు 75 సంవత్సరాల నుండి ఇది పట్టా భూమి 75 సంవత్సరాల నుండి కబ్జాలనే ఉన్నానన్నారు . ఇట్లాంటి సామాజికవేత్త ముసుగులో ఎవరైతే భూములు కొనుగోలుదారులపై బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం చేస్తున్నటువంటి వీరుపై ప్రభుత్వం చట్టరితే చర్య తీసుకోవాలని ఇది ప్రజలకు తెలవడం కోసం ప్రజలు నిజాన్ని తెలుసుకోవడం కోసం ఇది మా యొక్క ప్రయత్నం తప్ప మాకు అన్ని హక్కులున్నాయన్నారు.ఏదో మేము మా భూమి పోతుందని, కాదు అని మేము తప్పు చేయలేదని, అని తెలిపారు.ఏదో తప్పుడు కాగితం సృష్టించి ఓన్లీ ధర్మిలో ఆన్లైన్లో వచ్చినంత మాత్రాన కాదు కనుక ప్రభుత్వం గుర్తించాలన్నారు.ఈ సామాజిక వేత్త ముసుగులో బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి వారిపై చట్టరిత్య చర్య తీసుకోవాలని ప్రజలందరూ గుర్తించాలన్నారు.ఇలాంటి వారు ఎక్కడన్నా వచ్చి ఇంకెవరినైనా ఇబ్బందులు పెడితే తక్షణమే పోలీస్ గాని కలెక్టర్ కి గాని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని పేర్కొన్నారు.
