
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 5 . ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ఉ పాధి అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మహిళలు అర్ధికంగా ఎదగాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్వృత్తి విద్యా కోర్సులు, ఉపాధి శిక్షణకు అందిస్తున్న మహిళా ప్రాంగణం సేవలు అభినందనీయంమహిళ ప్రాంగణం సందర్శించి, శిక్షణ పొందుతున్న మహిళలతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్నైపుణ్యతతో కూడిన వ్యాపారం సృష్టించుకొని మరొకరికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకాంక్షించారు.బుధవారం నగరంలోని టేకులపల్లిలోని దుర్గాబాయి మహిళా, శిశు వికాస కేంద్రం మహిళా ప్రాంగణంను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఉపాధి శిక్షణ పొందుతున్న మహిళలు కలెక్టర్ కు పూలమొక్కలు అందించి ఘనంగా స్వాగతించారు.మహిళా ప్రాంగణం అధికారిణి వేల్పుల విజేతతో కలిసి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మహిళా ప్రాంగణం పరిసరాలను కలియ తిరిగి కావాల్సిన మౌళిక సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలకు అందిస్తున్న వృత్తి విద్యా కోర్సులు, ఉపాధి శిక్షణ టైలరింగ్, ఏఎన్ఎం నర్సింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, టైపింగ్, ట్యాలీ, అకౌంటింగ్, కంప్యూటర్, డీసీఏ, డీటీపీ, డ్రైవింగ్, బ్యూటిషీయన్, మగ్గం వర్క్క్, తదితర కోర్సులు, టీచింగ్ రూమ్స్, డైనింగ్ హాల్ లను పరిశీలించారు. మహిళలకు స్వయం ఉపాధి సహకారానికి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసి సిబ్బంది పనితీరుకు కితాబు ఇచ్చారు.నర్సింగ్, కంప్యూటర్ విద్య, టైలరింగ్‌లో వృత్తి శిక్షణ పొందుతున్న మహిళలు, విద్యార్ధులతో కలెక్టర్ ముఖాముఖిగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మహిళలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ నిచ్చి వారికి స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జిల్లా మహిళా ప్రాంగణంలో ట్రైనింగ్ ఇస్తున్నామని అన్నారు. నేటి సమాజంలో పోటీ ప్రపంచానికి ధీటుగా ప్రతీ మహిళకు శిక్షణ అందించి జీవనోపాధి పొందే విధంగా మహిళా ప్రాంగణం ద్వారా పూర్తి భరోసా లభిస్తుందని తెలిపారు. ఆడపిల్లలు అర్ధికంగా గొప్ప స్థాయికి ఎదగడం కోసం కేవలం ఉపాధి కల్పనలోనే కాకుండా వివిధ పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి కూడా శిక్షణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కేవలం శిక్షణ వరకే పరిమితం కాకుండా శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధి కూడా కల్పిస్తున్నామని చెప్పారు. శిక్షణ తర్వాత సబ్సిడీ రుణాలు కూడా ఇప్పించేందుకు మహిణా ప్రాంగణం సహకరిస్తుందని అన్నారు. ఎం.పి.హెచ్.డబ్ల్యు. / ఏ.ఎన్.ఎం కోర్సుల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి, రెండవ ర్యాంకులు సాధించిన మహిళా ప్రాంగణం నర్సింగ్ విద్యార్థులను కలెక్టర్ అభినందించి, మెమెంటోలను బహుకరించారు. విద్యార్థినులకు స్టడీ, ఉపాధి అవకాశాల మెటిరియన్ ను అందించారు. వరుసగా రెండోసారి కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులను మహిళా ప్రాంగణం కైవసం చేసుకున్నందేకు కృషి చేసిన మహిళా ప్రాంగణం అధికారిని వేల్పుల విజేత ను శాలువాతో కలెక్టర్ సన్మానించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థినులు, శిక్షణ పొందుతున్న మహిళాలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో మహిళా ప్రాంగణం సిబ్బంది సరస్వతి, స్పందన, హిమ బిందు, మల్లిక, విజయ్ కుమార్, సుకన్య, మౌనిక, లాలయ్య, పల్లవి, దుర్గారావు, శాంతమ్మ, కళ్యాణి తదితరులు ఉన్నారు.
