
సాధారంగా ఆహ్వానించిన టిపిసిసి ఉపాధ్యాక్షుడు అటవీ శాఖ చైర్మన్ భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుదు పోదెం వీరయ్య.
పిబ్రవరి 5 పయనించే సూర్యుడుభద్రాచలం ఇంచార్జిబట్టా శ్రీనివాసరావుములుగు జిల్లా వాజేడు మండలంలోని చింతూరు పంచాయతీ పరిధిలోని చింతూరు గ్రామంలో నుండి 40 కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య అధ్యర్యంలో చేరారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ నుండి వచ్చిన టిఆర్ఎస్ కార్యకర్తలు గుగ్గిళ్ళ ఆనంద్,గుద్దేటి గోపి గుద్దేటి తిరుపతి, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను నమ్ముతూ మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ పథకం అందే విధంగా చర్యలు తీసుకునే ఒక మంచి నాయకుడు సమక్షంలో మేము కాంగ్రెస్ పార్టీలో చేరటం మాకు సంతోషకరమైన విషయయం అని తెలియజేశారు. వీరంతా కలిసి చింతూరు పంచాయతీ సీనియర్ కాంగ్రెస్ నేత బంధం కృష్ణ నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అటవీ శాఖ డెవలప్మెంట్ చైర్మన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు .ఈ యొక్క విషయం గురించి పోదెం వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందజేస్తామని అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్ లో పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్లని ప్రతి ఒక్కరిని గెలిపించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అంతేకాకుండా నూతనంగా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియమించే స్థానిక ఎన్నికలలో గెలుపు కోసం కృషి చేస్తామని తెలియచేస్తున్నాము