
నెహ్రూ యువ కేంద్ర వరంగల్ వారి ఆధ్వర్యంలోఆటల పోటీలుయువతరం యువత అసోసియేషన్ వారి నిర్వహణలో వెంకటాపురం మండల కేంద్రంలోని కాఫేడు సంస్థ ప్రాంగణంలో పిబ్రవరి 5పయనించే సూర్యుడువెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావుములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల సంబంధించిన బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ పోటిని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి జీవివి సత్యనారాయణ గారు హాజరై మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర వరంగల్ వారు గ్రామీణ ప్రాంతాల్లోని యువతి యువకులకు ఆటలు నిర్వహించడం అభినందనీయమని ఈ ఆటల ద్వారా యువకులలో దేహదారుఢ్యం పెంపొందడమే కాకుండా ఆత్మస్థైర్యం పొందుతుందని ధైర్యము విలువలు పెరుగుతాయని తద్వారా యువకులలో మంచి ప్రవర్తన పెంపొందించబడుతుందని అన్నారు. ఆటలు యువకులకు స్నేహభావాన్ని పెంపొందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వాలీబాల్ కబడ్డీ షటిల్ రన్నింగ్ తదితర ఆటల పోటీలు నిర్వహించి ఆ ఆటల పోటీలలో గెలుపొందినటువంటి విజేతలకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి అతిథిగా జిల్లా బాలల పరిరక్షణ అధికారి జయ ఓంకార్ హాజరై మాట్లాడుతూ యువకులు చెడు వ్యసనాలకు లోను కాకుండా మంచి అలవర్చుకోవడానికి ఆటలు ఎంతో దోహదపడతాయని ఆటల ద్వారా మనోధైర్యం పెరుగుతుందని అన్నారు.కాఫేడు సంస్థ డైరెక్టర్ లూర్దు రాజు హాజరై మాట్లాడుతూ యువకులకు ఆటల పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని వివిధ ఆటల పోటీల ద్వారా బాలబాలికల్లో స్నేహభావం పెంపొంది మంచి నడవడికలపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వాజేడు వెంకటాపురం మండలాలకు చెందిన సుమారు 150 మంది యువతీ యువకులు హాజరై ఆటల పోటీలలో పాల్గొన్నారు. విజేతలకు బహుమతుల ప్రధాన చేయడం జరిగింది.
