
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వెంట ఉర్సు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్, మరియు, బిఆర్ఎస్ నాయకులు
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్)ఉర్సు అనేది సూఫీ సంతుడి లేదా ఔలియా వర్ధంతి సందర్భంగా జరుపుకునే ఉత్సవం. ప్రధానంగా దర్గాహ్ లలో జరుపుకుంటారు. ఈ సాంప్రదాయం ప్రధానంగా దక్షిణాసియా ముస్లింలలో కానవస్తుంది. ఈ ఔలియాల ‘విసాల్’ (అల్లాహ్ తో చేరడం) ఉర్స్ అని భావిస్తారు. ఈ ఉర్స్ కార్యక్రమాలలో ప్రధాన ఆకర్షణ ఖవ్వాలీ కార్యక్రమం. దీనినే సమా క్వాని అనీ వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ఆయా దర్గాహ్ ల సజ్జాద-నషీన్ లు వ్యవహరిస్తారు. సోదర భావం కలిగిన ముస్లింలందరూ ఐక్యతగా ఉండి, సంస్కృతి సాంప్రదాయాలతో, అందరి క్షేమం కోరుకుని, కులమతాలకతీతంగా అందరిని సాదరంగా ఆహ్వానించి ఆ భగవంతుని కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకునే ఏకైక ఉత్సవం దర్గాల వద్ద నిర్వహించే ఉర్సు కార్యక్రమం అని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. నందిగామ మండలం చేగూరు లోని హజరత్ నిజాం షాహిద్ -ఉర్సు -ఎ – షరీఫ్ దర్గాలో ఉర్సు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి హాజరయ్యారు. ఉర్సు కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తో పాటు కేశంపేట మండలం మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఉర్సు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి నవీన్ రెడ్డి ముస్లిం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల ద్వారా తను స్వయంగా, తనతో పాటు పాల్గొన్న మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ మరియు బిఆర్ఎస్ నాయకులు ఆశీర్వాదాలు అందుకుని, మత పెద్దల ప్రార్థనల ఫలితంగా ఆ దేవుని దయ కృప కరుణ కటాక్ష వీక్షణాల వల్ల రాష్ట్ర ప్రజలందరితో పాటు, ఉమ్మడి పాలమూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఆర్థిక అభివృద్ధిలో ముందంజ వేసి నియోజకవర్గ ప్రజలందరి కుటుంబాలు ఏ రకమైన ఆర్థిక లోటుకు గురికాకుండా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిపి రవిందర్ యాదవ్, మాజీ జడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్, నందిగామ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, నర్సప్పగూడ మాజీ సర్పంచ్ అశోక్, పిఎసిఎస్ చైర్మన్ అశోక్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ విఠల్, చేగురు ఉపసర్పంచ్ సురేష్, నర్సప్పగూడ ఉప సర్పంచ్ శేఖర్, బిఆర్ఎస్ నాయకులు బండ మల్లేష్, జంగిలి కుమార్, మంకాల యాదయ్య,ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.