
//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 7 మక్తల్నా రాయణపేట జిల్లా మఖ్తల్ పట్టణంలోని స్వామి వివేకానంద కూడలిలో ఏర్పాటు చేయనున్న
వివేకానందుడి విగ్రహా ఏర్పాటు సందర్భంగ మఖ్తల్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలనే భావనతో అట్టి విరాళాల సేకరణ కరపత్రాలను నేరడగం పీఠాధిపతి శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం స్వామిజీ మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆధ్యాత్మిక, సేవ భావనలలో మఖ్తల్ ప్రాంతం చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నదని అలాంటి ప్రాంతంలో స్వామి వివేకానంద విగ్రహం లేదన్న వెలితి ఉండేదని ఆ లోటు ఇప్పుడు తీరబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ సభ్యులు పాల్గొన్నారు