
కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలను ఓడించాలని టార్గెట్ గా పెట్టుకున్నాయి :- బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వాళ్ళ దేశవ్యాప్తంగా ఆ పార్టీకి కాలం చెల్లింది:- గిరిబాబు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం కావడంతో మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లో ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు కాంగ్రెస్ ని పట్టించుకోలేదు అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలన చూసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు కాలం చెల్లిందని గిరిబాబు అన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడం కోసం బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క సీట్ కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ కి ఇంగా దేశంలో మనుగడ కష్టమే అని గిరిబాబు అన్నారు.