
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 9:- రిపోర్టర్ (కే శివకృష్ణ):- బాపట్ల మండలం లోని కంకటపాలెం గ్రామం లో గల ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ను గ్రామ పంచాయతి నిర్వహించడం జరుగుతుంది. సదరు వాటర్ ప్లాంట్ నిర్వహణ సరిగా లేక గ్రామ ప్రజలు ఇబ్బంది పడుచున్నారు. సదరు ప్లాంట్ కు స్కానర్ ఏర్పాటు చేయటం జరిగింది. కాని ఆ స్కానింగ్ మిషన్ సరిగా పని చేయక వాటర్ రావటం లేదు. డబ్బులు మాత్రం తీసుకోని వాటర్ మాత్రం బైటికి రావు. ఈ ప్లాంట్ పంచాయతీ కి పెద్ద ఆదాయ వనరు గా ఉంది. సదరు ప్లాంట్ లోని వాటర్ ఫిల్టర్ కూడా సరి చేసి మరియు స్కానింగ్ మిషన్ కూడా కొత్తది పెట్టి నిర్వహణ సరిగా చేయాలనీ గ్రామ ప్రజలు ఆవేదన చెందుచున్నారు. సదరు ప్లాంట్ మీద వస్తున్న కాసులు మీద ఉన్న ప్రేమ ప్లాంట్ మీద కూడా ఉండాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు…