
పయనించే సూర్యుడు ప్రతినిధి ఫిబ్రవరి8 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం:- ఢిల్లీ నందు జరిగిన ఓట్ల లెక్కింపులో భాగంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన సందర్భంగా సుండుపల్లి మండలం కూడలి నందు బానసంచా కాల్చి కేక్ కట్ చేయడం జరిగింది. ఢిల్లీ నందు వరసగా 27 సంవత్సరాలు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండేది. ఢిల్లీ కేంద్రం నందు బీజేపీ ఆదివారం భారీ విజయాన్ని నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు బిజెపి సుండుపల్లి మండల అధ్యక్షుడు యస్ వి రమణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో రాజంపేట అసంబ్లీ కన్వినర్ రాంజగదీష్ స్వామి రంగయ్య నాయుడు బిజెపి కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జ్ కే వెంకటరామరాజు బీజేపీ సీనియర్ నాయకులూ గోపాలరాజు సుబ్బరాజు నాగరాజ రాచరాయుడు సుండుపల్లి మాజీ ఎంపీటీసీ నంద్యాల రామయ్య బిజెపి ఓబీసీ మండల అధ్యక్షులు జి శ్రీనివాసులు జిల్లా కార్యదర్శి ఆర్ శివ శంకర్ బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు సుబ్బరామరాజు బిజెపి మండల ఉపాధ్యక్షులు రెడ్డయ్య చారి టిడిపి యువ నాయకులు సురేష్ నాయుడు సిద్దేశ్వర మోహన ఎస్ రెడ్డయ్య అశోక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు