
రాబోయే పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి
*పుల్కల్ ఎస్.ఐ. పాటిల్ క్రాంతి కుమార్ *
పయనించేసూర్యుడు న్యూస్.11పిబ్రవరి పుల్కల్ ప్రతినిధి పెద్దగొల్లవిజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలపరిదిలోనిముద్దాయిపేటవద్దగల మాడల్ స్కూల్. మరియు జునియర్ కాలేజివద్ధ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి రాబోయే పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని పుల్కల్ ఎస్సై పాటిల్ క్రాంతి కుమార్ అన్నారు. నేటిరోజునాడు ఇంటర్.మరియు పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఆయన తగు సూచనలు సలహాలు ఇచ్చారు అలాగే సైబర్ క్రైమ్. పోక్సో. రోడ్డు భద్రత ఇతర చట్టాలపై వారు విద్యార్థులకు అవగాహన కల్పించారు అంతేకాకుండా విద్యుత్ తో పాటు క్రీడల్లో సైతం ప్రతిభ కనబరచాలన్నారు ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా ఉత్తీర్ణత సాధించాలన్నారు భవిష్యత్తులో ప్రతి విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలన్నారు అప్పుడే తమ తల్లిదండ్రులు సంతోషిస్తారన్నారు వారి సంతోషాన్ని వమ్ము చేయకుండా చదువుపై దృష్టి సారించి పరీక్షల్లో తమ ప్రతిభను కనబరిచి మంచి మార్కులతో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.