
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి వెన్నంపల్లి గ్రామంలో బుధవారం శ్రీ స్వయంభు మత్స్యగిరీంద్ర స్వామి జాతర ఉత్సవాలు జరగనున్నాయి. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమైన మత్స్యగిరీంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ సారబుడ్ల వెంకటరెడ్డి తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం ఆలయ ప్రాంతంలో అన్ని వసతులు కల్పించడం జరిగిందన్నారు.