
//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 18//మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జి వడ్ల శ్రీనివాస్// క్రిష్ణ మండలంలోని కున్సి గ్రామ రైతు వేదికలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. వాకిటి శ్రీహరి . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చుట్టూ పక్కల గ్రామ ప్రజలు దూరు రామ్ రెడ్డి లయన్స్ కంటి సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటుకు కృషి చేసిన వారిని లువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి , నియోజకవర్గ ముఖ్యనాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.*