
పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 19 మక్తల్ , నారాయణపేట బిజెపి జిల్లా అధ్యక్ష పదవి కోసం మక్తల్ పట్టణానికి చెందిన బి. కొండయ్య నారాయణపేట జిల్లా కేంద్రంలో నామినేషన్ స్వీకరణ అధికారి కట్ట సుధాకర్ రెడ్డి కి మంగళవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పేట బిజెపి అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన కొండయ్య బిజెపిలో ఎన్నో ఏళ్ల నుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మక్తల్ ఎంపీపీగా పనిచేశారు. బాల్యం నుండి స్వయంసేవకుగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు 1986 నుండి 1995 వరకు పత్రిక విలేకరిగా పనిచేశారు.1995లో మక్తల్ ఎంపీటీసీ నాలుగవ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. మరొకసారి మక్తల్ ఒకటి స్థానం నుండి ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొంది మక్తల్ ఎంపిపి పీఠం కైవాసం చేసుకుని ఎంపీపీ గా పని చేశారు. జెడ్పిటిసి మెంబర్, గా మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మక్తల్ నియోజకవర్గం లో పార్టీ పటిష్టత కోసం ఎనలేని కృషిచేసి మొదటిసారి మక్తల్ మున్సిపల్ చైర్మన్ స్థానం కైవసం చేసుకోవడంలో సఫలీకృతమై అధిష్టానం మెప్పు పొందారు. మక్తల్ నియోజకవర్గం లో 18 పీటీసీ స్థానాలు 25 మంది సర్పంచులు 15 మంది సింగల్ విండో డైరెక్టర్లు అనేక మంది ఉపసర్పంచ్లు గెలవడం కోసం నిరంతరం శ్రమించిన కొండయ్య కు పార్టీ జిల్లా అధ్యక్షునిగా అవకాశం ఇస్తే పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని కొండయ్య విలేకరులకు తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బి కొండయ్య ప్రస్తుతం కొనసాగుతున్నారు. వెనుకబడిన మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో పోరాటాలు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీ కులకుకార్యకర్తలకుఅందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తున్న తమ నేతకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని బిజెపి నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు. కొండయ్య సేవలను బిజెపి అధిష్టానం గుర్తించి నారాయణపేట జిల్లా అధ్యక్షులు పదవి కి అన్ని అర్హతలు ఉన్నా తమ నాయకుడిని ఎన్నుకుంటే నారాయణపేట జిల్లాలో పార్టీకి వన్నె తీసుకువస్తారని పలువురు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.