Saturday, March 1, 2025
HomeUncategorizedకూకట్పల్లి నియోజకవర్గం లో పలు సమస్య పై జోనల్ కమిషనర్ ని కలిసిన బండి రమేష్

కూకట్పల్లి నియోజకవర్గం లో పలు సమస్య పై జోనల్ కమిషనర్ ని కలిసిన బండి రమేష్

Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 19 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ బుధవారం ఆయన కార్యాలయంలో కలిశారు.నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుమారు గంటకు పైగా ఇరువురు చర్చించారు. ముఖ్యంగా జాతీయ రహదారితో పాటు స్థానిక రహదారుల పైన ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళ ఏర్పడే రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, మురికి నీటిపారుదల పరిసర ప్రాంతాలు చెరువులు, కుంటల్లో దోమలు విపరీతంగా వ్యాపిస్తున్నాయని వాటి కట్టడికి తీసుకోవాలని చర్యలను వెంటనే చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వం హయాం లో సర్దార్ పటేల్ నగర్ హస్మత్ పేట లో ఏర్పాటు చేసిన మోడల్ రైతు బజార్లు నేటికీ కూడా టిఆర్ఎస్ నాయకుల కబంధహస్తాల్లో ఇరుక్కుపోయాయని వాటిని విడిపించాలని సూచించారు. కెపి హెచ్ బి లో కట్టాల్సిన వంద పడకల ఆసుపత్రి, మూసాపేట వై జంక్షన్ లో నిర్మించాల్సిన ఫ్లైఓవర్ బ్రిడ్జి, రహదారుల విస్తరణ వీధి దీపాల ఏర్పాటు త్రాగునీరు సమస్యలతో పాటు నియోజకవర్గంలో భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు వాటికి నిధుల విడుదల వంటి అంశాలపై రమేష్ జోనల్ కమిషనర్ తో కూలంకషంగా చర్చించారు. అదేవిధంగా మలేషియా టౌన్షిప్ లోని సీనియర్ సిటిజన్స్ ను పక్కనే గల పార్కులో వాకింగ్ కు సైతం అనుమతించడం లేదన్న టౌన్షిప్ అసోసియేషన్ సభ్యుల ఫిర్యాదు పై జోనల్ కమిషనర్ స్పందించారు. సమస్య పరిష్కారం కోసం హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments