
పయనించే సూర్యుడు // ఫిబ్రవరి // 19 // హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్ // బిజెపి బలపరిచిన అభ్యర్థి అంజిరెడ్డికి పట్టభద్రులు అండగా ఉంటారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. అంజిరెడ్డి గెలుపు కోసం జమ్మికుంట పట్టణంలో బిజెపి శ్రేణులు పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ..అంజిరెడ్డి సేవా భావంతో ఎస్ ఆర్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి అనేక మంది పేద విద్యార్థులకు దుస్తులు,పుస్తకాలు కొనిచ్చాడని, సౌకర్యాలు లేక మూతబడుతున్న స్కూళ్లకు లక్షలాది రూపాయలు వెచ్చించి ఫర్నిచర్,ఇతర సౌకర్యాలు కల్పించి ఆదుకున్నాడని తెలిపారు. బస్టాండ్లు,దేవాలయాలు,ప్రజలు అత్యధికంగా సంచరించే ప్రదేశాల్లో వాటర్ ప్యూరిఫయార్ మిషన్లు ఏర్పాటుచేసి వేలాది మంది ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి ప్రయత్నం చేశాడని కొనియాడారు. గత 20 సంవత్సరాలుగా నిరుద్యోగ యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాడని, కరోన సమయంలో కోట్లాది రూపాయల నిత్యవసర వస్తువులు, సానిటైజర్లు ఉచితంగా పంపిణీ చేసాడని గొప్ప సేవా బావం కలిగిన వ్యక్తి అంజిరెడ్డి అని కితాబిచ్చాడు.అనేక రకాల హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని సంపత్ రావు దుయ్యబట్టాడు. ముఖ్యంగా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడంలో, వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సంపత్ రావు మండిపడ్డాడు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని, సంపత్ రావు కొనియాడారు. నరేంద్ర మోడీకి మద్దతుగా పట్టభద్రులు అంజి రెడ్డి గారికి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని సంపత్ రావు పట్టభద్రులను కోరారు.సంపత్ రావు వెంట బీజేపీ జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్,పల్లపు రవి,కొమ్ము అశోక్,రాచపల్లీ ప్రశాంత్, శ్రీవర్తి ప్రవీణ్,జోరుక శ్రీనివాస్,శ్రివర్తి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
