
దళిత ప్రజాసంఘాలు అంబేద్కర్ యువజన సంఘం మక్తల్
//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 21//మక్తల్ బుడగ జంగాల సంఘం అధ్యక్షతన MRPS మరియు దళిత ప్రజా సంఘాల* ఆధ్వర్యంలో ఈ నెల 11 తారీఖున కర్ణాటక రాష్ట్రం,యాదగిరి జిల్లా,గురుమిటికల్ ప్రాంతానికి చెందిన సాయమ్మ, శ్యామమ్మ అనే బుడగ జంగాల దళిత బాలికలపై సామూహిక అత్యాచారం చేసి,చంపి చెరువులో పడివేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి,కఠినంగా శిక్షించాలని… మరియు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యాదగిరి జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుండి యాదగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీలో అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ మరియు పుడమి ఫౌండేషన్ గా పాల్గొని, జిల్లా ఎస్పీ పృత్విక్ శంకర్ కి వినతి పత్రాలను అందజేయడం జరిగింది. అంతకు ముందు కలెక్టర్ కార్యాలయం ముందు నాయకులు మాట్లాడుతూ…ఈ దారుణ సామూహిక అత్యాచార ఘటన జరిగి 10 రోజులు కావస్తున్న కూడా ఇంకా నిందితులను అరెస్టు చేయకపోవడం అనేది అణగారిన వర్గాల ప్రజల పట్ల ఉన్న పోలీసుల,ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అని,కావున వెంటనే ఎఫైర్ నమోదు చేసి,బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని… లేనిపక్షంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్ అధ్యక్షులు పృథ్వీరాజ్,పుడమి ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటపతి రాజు, అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ క్రియాశీలక సభ్యులు తల్వార్ నరేష్,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
