
ఆయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 22:- రిపోర్టర్ (కే శివకృష్ణ ) అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఫౌండేషన్ ప్రెసిడెంట్ ,గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాష తెలిపారు.కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం ఎంవీరాజుపాలెం బంగారురెడ్డిపాలెంకు చెందిన నిరుపేద కుటుంబం కు 10 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాష మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం ,నిత్యావసర సరుకులు ,దుప్పట్లు ,అనారోగ్యంగాఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ( ఆర్మీ రిటైర్డ్ ) ,షేక్ ఇబ్రహీం, షేక్ బహదూర్ బాష ,షేక్ ఖాదర్ వలి తదితరులు పాల్గొన్నారు