
ముఖ చిత్రకారుడు ప్రభు. పయనించే సూర్యుడు //ఫిబ్రవరి //21// హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ //కుమార్ యాదవ్. కరీంనగర్, అదిలాబాద్, నిజాంబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోభాగంగా బక్క జడ్సన్ శుక్రవారం జమ్మికుంట చెందిన ప్రముఖ చిత్రకారుడు అంబాల ప్రభాకర్ (ప్రభు ) మద్దతు కోసం రావడం జరిగింది. ప్రభు ఆర్ట్ గ్యాలరీ కి మర్యాద పూర్వకంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించి పూలబోకెను అందజేసి, శుభాకాంక్షలు తెలియ జేశారు.ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ కరీంనగర్, అదిలాబాద్, నిజాంబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలలో డబ్బు, రాజకీయ అధికార బలం ఉన్న సంపన్నులతో పోటీపడుతున్న ప్రశ్నించే గొంతుక, ప్రజల పక్షాన ఉండే నాయకుడు,ఎక్కడ అన్యాయం జరిగిన నిలదీసే నేత పక్క జడ్సన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడం గర్వంగా ఉందన్నారు. సామాన్యుడిగా ఉంటూ ప్రజల మధ్యల తిరుగుతూ వారి సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన నాయకుడే బక్క జడ్సన్ అని కొనియాడారు.అతనికి పట్టభద్రులు అందరు ఆలోచనలతో తమ అమూల్యమైన ఓటును నీతి, నిజాయితీ నిబద్ధతతో నిరుపేద నాయకుడు బక్క జడ్సన్ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోనే బాధ్యత పట్టబద్రుల పైన ఉందన్నారు. సంపన్న పార్టీలు సంపన్న నాయకుల డబ్బు, రాజకీయ బలంతో గెలవాలని పట్టభద్రులను రకరకాల ప్రలోభాలకు లోను చేస్తున్నారని మండిపడ్డారు. పట్టభద్రులు అందరూ అమ్ముడు పోకుండా తమ ఓటు హక్కును నీతి నిజాయితీతో వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్య్రమంలో శివ, కాశి, కలీం, జావిద్ తదితరుల పాల్గొన్నాను
