
ప్లాస్టిక్ వద్దనండి పర్యావరణని కాపాడండి….
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 23:- రిపోర్టర్ కే శివకృష్ణ) బాపట్ల మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మరియు మహిళా సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో”ప్లాస్టిక్ వద్దనండి, పర్యావరణాన్ని కాపాడండి”అనే నినాదంతో ప్లాస్టిక్ రైత సమాజ స్థాపన కోసం ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ర్యాలీని బాపట్ల పట్నంలోని సరస్వతీ మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాల వద్ద బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తం గారు జండా ఊపి ర్యాలీని ప్రారంభించినారు. మీరు గమనించారా మన జీవితాన్ని ప్లాస్టిక్ ఎలా ఆక్రమించిందో, మీ కూరగాయలు పూలు పళ్ళు ఉప్పులు పప్పులు పెరుగు పాలు బట్టలు మందులు అన్ని ప్లాస్టిక్ లో వస్తున్నాయి చుట్టూ ఒక సారి పరికించి చూడండి మీ ఇల్లు వాకిలి మీ ఇంటి ముందు రోడ్డు మీద చెత్త మీ పారని మురుగుకాలువ అంతా ప్లాస్టిక్ మయం. ఇది మనకు తేలికగా కనిపిస్తున్న ఆక్రమణ , కనిపించని ఆక్రమణ చాలా ఉంది. అందువలన ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను ఉపయోగించి ప్లాస్టిక్ సంచులను (అనగా కవర్లను) ఉపయోగించవద్దని పిలుపునిచ్చినారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ శరత్ బోస్ గారు మాట్లాడుతూ,మనం పారేసిన ప్లాస్టిక్ నుండి సూర్య రశ్మి మూలన మరియు ఇతర రసాయనిక ప్రక్రియల మూలంగా బిస్ఫెనాల్స్, థాలేట్స్ వంటి రసాయనాలు బయటికి వచ్చి మనుషులు జంతువుల శరీరాల్లో చేరి హార్మోన్ల సమతుల్యత ని దెబ్బ కొట్టి పిల్లలు పుట్టక పోవటం ,ఊబకాయం, మెటబాలిక్ జబ్బులు అంటే మధుమేహం, రక్తపోటు మరియు క్యాన్సర్ల కు కారణ మవుతున్నాయ్, ఈ ప్లాస్టిక్స్ క్రమేణా విచ్ఛిత్తి చెంది కంటికి కనపడని సైజ్ లో అంటే మైక్రోప్లాస్టిక్స్ గా మన రక్తం లోకి ప్రవేశించి రక రకాల జబ్బులకు కారణమవుతున్నాయి. అందువలన ప్రతి ఒక్కరూ అవగాహనతో ప్లాస్టిక్ ను వినియోగించుకోకుండా ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపన కోసం కృషి చేయాలని కోరినారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ మనం చెత్తతో మూట కట్టి పారవేసిన ప్లాస్టిక్ సంచులను ఆహారమనుకొని తిని ఆవులు గేదెలు వంటి మూగ జీవిలు వాటి ప్రేగులకు అడ్డుపడటం మూలాన జబ్బులబారిన పడుతున్నాయి .చచ్చి పోవుచున్నాయి. మురుగు కాలువలు నిండి పోయి నీటి ప్రవాహాన్ని తగ్గించి దోమలు ఈగలు మరియు దుర్గంధం వ్యాప్తికి దోహద పడుతున్నాయి, కాలువల నుంచి సముద్రం లోకి ప్రవేశించి సముద్ర జీవుల్ని నాశనం చేస్తున్నాయి, పారవేసిన ప్లాస్టిక్ తాళ్ళ వలల్లో ఇరుక్కుని తిమింగలాలు వంటి పెద్ద పెద్ద జంతువులు సహితం నాశనమవుతున్నాయి. పరిస్థితి చివరికి జీవ జాతి మనుగడను దెబ్బ కొట్టేంతగా పరిణమించింది, మనం చేజేతులా తెచ్చుకున్న సమస్యను పరిస్థితి చేజారే లోపల మనమే పరిష్కరించుకోవాలి అని తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను ఉపయోగించాలని కోరినారు. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మరియు మానవతా జాయింట్ సెక్రెటరీ కోలా పద్మజ మాట్లాడుతూప్లాస్టిక్ వద్దనండి పర్యావరణను కాపాడండి ,జీవకోటిని రక్షించండి, విద్యార్థులు తల్లిదండ్రులు మంచి అవగాహనతో ప్లాస్టిక్ వస్తువులను ముఖ్యంగా వాటర్ గ్లాస్ లను టీ కప్పులను భోజనాలు చేసే విస్తర్ల సైతం విస్మరించి గుడ్డ సంచులను కాగితపు గ్లాసులను కప్పులను ఉపయోగించుకోవాలని విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరినారు. ర్యాలీ ప్రధాన వీధుల గుండా ఆంజనేయ స్వామి గుడి స్టేట్ బ్యాంకు రోడ్డు గడియార స్తంభం జి బి సి రోడ్డు మీదగా ఎమ్మార్వో కార్యాలయం వద్ద చేరుకున్నది. స్థ సెక్రటరీ ఎం ప్రసన్నాంజనేయులు, సభ్యులు గురజాల శ్రీనివాసరావు డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ జి శాంతారామ్, హరిప్రసాద్, రఘురాం బి. అనంత కుమారి, మహిళా సమాఖ్య సెక్రెటరీ ప్రసన్న లక్ష్మి, మంజులత, కన్యాకుమారి, ట్రెజరర్ కేశవులు, వాసుదేవరావు, సూరిబాబు, జి వెంకటేశ్వర్లు బి. వంశీ దీపక్, ఏ .రవికుమార్ కే రవీంద్ర పాల్గొన్నారు. పట్టణంలోని అగ్రికల్చర్ కాలేజీ, సరస్వతీ మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాల, ఏవివి ఉన్నత పాఠశాల, గురుకుల పాఠశాల, ఫుడ్స్ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్సిసి ,ఎన్ఎస్ఎస్, మున్సిపల్ సిబ్బంది, పోలీసు వారు పాల్గొన్నారు.