
- మాజీ ఎంపీటీసీ జీడీ దేవేందర్
పయనించే సూర్యడు //ఫిబ్రవరి //23 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. వినవంక మండలం వల్బపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, మాట్లాడుతూ..గ్రాడ్యుయేట్, ఓటర్లకు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని పట్టభద్రుల సంక్షేమానికి పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ జీడీ దేవేందర్ కోరడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యాడాదిలో 55,000 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ది అని అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదని,గతంలో ఉద్యోగుల జీతాల విషయంలో అవస్థలు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం,,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి తారీఖున జీతాలు అందిస్తుoదని తెలిపారు.ప్రభుత్వరంగ సంస్థలను కాంగ్రెస్ అభివృద్ధి చేస్తే,బీజేపి వాటిని నిర్వీర్యం చేస్తుందని అన్నారు.పట్టభద్రుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని,బీజేపి పార్టీ తెలంగాణకు బడ్జెట్ లో అన్యాయం చేసిందనీ 8 మంది ఎంపీలు ఉన్నా బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని,బీజేపి,బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నాయని అన్నారు.ఫీజ్ రెంబర్స్మెంట్ ద్వారా అనేక మంది పట్టభద్రులుగా మారారని గుర్తు చేశారు.ట్యూషన్ చెప్పుకునే సాధారణ స్థాయి నుండి విద్యావేత్తగా ఎదిగిన నరేందర్ రెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీ ఇవ్వాలని,పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా,శాసన మండలిలో బలంగా కొట్లాడతరని అన్నారు.