Monday, February 24, 2025
Homeఆంధ్రప్రదేశ్దళితుల భూములకు రక్షణ కల్పించాలి.

దళితుల భూములకు రక్షణ కల్పించాలి.

Listen to this article

తడికల శివకుమార్ బిఎస్పీ జిల్లా ఇన్ చార్జ్,భద్రాచలం నియోజకవర్గం అదనపు ఇన్ చార్జ్ .

పయనించే సూర్యుడు: ఫిబ్రవరి 24: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ. వాజేడు:దళితుల భూములకు ప్రభుత్వ రెవిన్యూ యంత్రాంగం రక్షణ కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ చార్జ్,భద్రాచలం నియోజకవర్గ అదనపు ఇన్ చార్జ్ తడికల శివకుమార్ న్నారు.ఆదివారం నాడు వాజేడు మండలంలోని పలు పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వాజేడు వచ్చిన ఆయనకు అరుణాచల పురం దళితులు వాజేడు మండలం లో అరుణాచల పురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 21 లోగల 8.60 తమ భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అడిగితే మేం ఆదివాసులమని బెదిరిస్తున్నారని అందుకు రెవిన్యూ సర్వేయర్ మద్దతుగా నిలుస్తున్నాడని పిర్యాదు చేశారు. ఈ విషయమై సంఘటనా స్థలానికి స్వయంగా పార్టీ శ్రేణులతో కలిసి వెల్లి పరిశీలించి న బిఎస్పీ జిల్లా ఇన్ చార్జ్ ఆ విషయాను సారమై సోనవారం పత్రికా ప్రకటన చేస్తూ తక్షణమే భాదిత దళిత కుటుంబ సభ్యుల వ్యవసాయ భూమికి రక్షణ కల్పించాలని కోరారు,ఆక్రమించేందుకు ప్రయత్నం చేసిన సదరు‌ వ్యక్తులపై పోలీసు లు కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 14,16,17,21 ప్రాథమిక హక్కుల ప్రకారం ,అసైండ్ మెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం దళితుల కు అంటరానితనం నిర్మూలన కొరకు కేటయించ బడిన భూములను ప్రయివేటు వ్యక్తులకు అధికారులు ధారాదత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దళితులైన సప్పిడి సమ్మయ్య తండ్రి పేరు రామయ్య,సప్పిడి రాంబాబు తండ్రి రామయ్య,కుమ్మరి సారమ్మ భర్త ఏసు,సప్పిడి సాంభ శివరావు తండ్రి సమ్మయ్య,సప్పిడి నాగరాజు తండ్రి ముత్తయ్య అను వ్యక్తుల సాగులో ఉన్న సర్వే నంబర్ 21 విస్తీర్ణం 8.60 సెంట్లు గల సాగు భూమి ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేసిన చిక్కుడు భుజంగం రావు అను వ్యక్తి ని,అందుకు సహకరించేలా వ్యవహరించిన సర్వేయర్ పై మండల తహసీల్దారు విచారణ జరిపి తగు శాఖాపరమైన. చర్యలు తీసుకోవాలని అన్నారు.లేని ఎడల బాదిత ప్రజల తో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షుడు కొండా చరణ్,నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వాజేడు మండల‌ ఇన్ చార్జ్‌ కుమ్మరి రాంబాబు,నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ చార్జ్‌ జనగం కేశవ్ రావు, సప్పిడి సాంబశివరావు, రాంబాబు, బాబు, ఏసు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments