
పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 26//ఉట్కూర్ అక్షర విజేత నారాయణపేట జిల్లా/ ఊట్కూర్ ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకొని రావాలని.ప్రిన్సిపల్ మురళీధర్ చారి ఆకాంక్షించారు.కళాశాలలో మంగళవారం ఉత్సాహంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ గ్రామంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను కళాశాలలో చేర్పించాలనారు.విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు…