
స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్ కు నివాళులు.
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 28 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. తిరువూరు రూరల్ గానుగపాడు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి ప్రాణ త్యాగం చేసిన విప్లవ వీరుడు చంద్ర శేఖర్ ఆజాద్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి స్థానిక గ్రామ సచివాలయంలోగురువారం నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు యం. రాం ప్రదీప్, గ్రామ సచివాలయ సిబ్బంది మహమ్మద్ మదిని, బర్రె చరణ్ తేజ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.