
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 28 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని ఇంజినీరింగ్ ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది ఇప్పటి వరకు కొనసాగుతున్న పది హేను శాతం ఓపెన్ కోటాను తీసేసింది ఆ కోటా సీట్లను తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్లు ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించనుంది దీనికి సంబంధించిన జీవో నంబర్ పది హేను తారికు న విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా రిలీజ్ చేశారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫార్మసీ ఫార్మా డీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ అప్లికేషన్ లా ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో యనబై ఐదు శాతం స్థానిక తెలంగాణ స్టూడెంట్లకు పద హెను శాతం ఓపెన్ కేటగిరి సీట్లలో తెలంగాణతోపాటు ఏపీ స్టూడెంట్స్ పోటీపడే అవకాశం ఉంది. అయితే ఏపీ తెలంగాణ విభజన జరిగి పందేళ్లు పూర్తయిన నేపథ్యంలో పాత విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలికింది స్థానికత అడ్మిషన్ల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసింది