
పయనించే సూర్యుడు: ఫిబ్రవరి:28: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ. వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల మురుమూరు పంచాయతీ పరిధిలోని గణపురం కాలనీ గ్రామ విషయం చూస్తుంటే అందరికీ జాలేస్తుంది కానీ ఆ యొక్క గ్రామ పరిస్థితిని నీటి ఎద్దడిని గమనిస్తే అసలు విషయం అర్థం అవుతుంది వివరాలకు వెళితే ఎన్ని ప్రభుత్వాలు మారిన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న గ్రామా లపరిస్థితి మాత్రం మారటం లేదు. కారణం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడమేనా? రెండు రోజులకి ఒక్కసారి మాత్రమే రెండు బిందెల మంచినీళ్లు వస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లకు బెదిరింపులు ఎందుకని ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు గ్రామాల్లోకి వచ్చి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నీటి ఎద్దడిని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.