
ఘనంగా విజ్ఞాన శాస్త్ర దినోత్సవ వేడుకలు . పయనించే సూర్యుడు గాంధారి 0/1/03/25. గాంధారి ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకున్నది. భారతీయ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆసియా ఖండంలోనే తొలి నోబెల్ బహుమతి పొందిన సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పాఠశాల సైన్స్ ఉపాధ్యాయ బృందం శ్రీదేవి, వనజ, శంకర్ గౌడ్, శరణ్య గారు ట్లాడుతూ, మానవజాతి నేడు పొందుతున్న సౌకర్యాలు, వసతులన్నీ సైన్స్ ఇచ్చిన వరాలని, విద్యార్థులందరూ శాస్త్రీయ దృక్పథం, వైఖరిని పొందించుకోవాలని, మూఢనమ్మకాలను నమ్మవద్దని తెలిపారు. శాస్త్రవేత్తల నిరంతర కృషి ఫలితంగా నూతన ఆవిష్కరణలతో ప్రపంచం దూసుకుపోతుందని కొనియాడారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ విద్యుత్ తయారీ నమూనా, జనతా ఫ్రిడ్జ్, హైడ్రోపోనిక్స్ అగ్రికల్చర్, హైడ్రాలిక్ లిఫ్ట్, వాటర్ ఓవర్ ఫ్లో అలారం , వాటర్ ప్యూరిఫికేషన్ మోడల్, వాక్యూమ్ క్లీనర్, వివిధ అంతర్గత శరీర అవయవ వ్యవస్థల వర్కింగ్ మోడల్స్ ను విద్యార్థులు ఆసక్తితో తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రాజా పండిత్, మన్సూర్, చిరంజీవి, రాధాదేవి,చక్రధర్, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, బాల్ రెడ్డి, లక్ష్మీ నరసయ్య, వాణి,నాగలక్ష్మి, సాయిలు పాల్గొన్నారు.