
జగతి ఉన్నంత కాలం
‘సజీవంగా జీవించే ఉంటరు:నరేష్ మాదిగ
పయనించే సూర్యుడు మార్చి 2 ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండలం వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సభలు ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరులకు ఘనమైన నివాళి మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ పోరులోఅసువులు బాసిన అమరులను స్మరిస్తూ మాదిగ అమరవీరుల కు ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ మాదిగ జాతి భవిష్యత్తుపై ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరుల త్యాగాలు మరువలేనివని మాదిగ వీరుల మరణం లేదు జగతి ఉన్నత కాలం సజీవంగా జీవించి ఉంటారని అమరుల ఆశయ సాధన కోసం మందా కృష్ణ మాదిగ సారధ్యంలో జరిగే ప్రతి పోరుకు మాదిగలు సమసిద్ధమై ఉండాలని లక్ష డప్పుల వేల గొంతుల మాదిగల మహా ప్రదర్శనకు మాదిగల సిద్ధమై ఉండాలని మాదిగల విజయం అమరులకు అంకితం అని మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు దామెర్ల వీరయ్య మాదిగ, మహిళా అధ్యక్షురాలు దామెర్ల కరుణ మాదిగ, అయోధ్యమాదిగ తగరంనాగేశ్వరావు మాదిగ, విసనపల్లి నరసింహారావు మాదిగ, విసనపల్లి గోపి మాదిగ, విసన పల్లి మనోహర్ మాదిగ, దామెర్ల నరేష్ మాదిగ,దామెర్ల ప్రసాద్ మాదిగ పాల్గొన్నారు.