Sunday, March 2, 2025
HomeUncategorized50కి.మీ రన్ లో మెడల్ సాధించిన కానిస్టేబుల్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు

50కి.మీ రన్ లో మెడల్ సాధించిన కానిస్టేబుల్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు

Listen to this article

ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం

పయనించే సూర్యుడు. మార్చి 2. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం టాటా అల్ట్రా మారథాన్ 50కి.మీ రన్ లో మెడల్ సాధించిన కానిస్టేబుల్ ను అభినందించిన పోలీస్ కమిషనర్ టాటా అల్ట్రా మారథాన్ 50కి.మీ రన్ లో మెడల్ సాధించిన కానిస్టేబుల్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. రాష్ట్రం, దేశంలో ఎక్కడ మారథాన్ నిర్వహించినా పాల్గొంటూ ప్రతిభ కనబరిచి పతకాలు సాధిస్తున్నట్లు ఖమ్మం ఏఆర్ కానిస్టేబుల్ పిల్లి రాజు తెలిపారు.ఈనెల 23వ తారీఖున పూనె సమీపంలోని లోనవాలా సయ్యాద్రి కొండలు నందు 800 మీటర్లు ఎత్తులో టాటా అల్ట్రా మారథాన్ రన్ 50 కిలోమీటర్లను 6గంటల 39 నిమిషాల్లో పూర్తిచేసి మెడల్ సాధించానని అన్నారు. సముద్రమట్టానికి 2400 అడుగుల ఎత్తులో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పరుగు మొదలు పెట్టిన రాజు.. రాత్రి సమయంలో తలకు టార్చిలైట్ పెట్టుకొని మరి అత్యంత ప్రమాదకరమైన కొండల మధ్యలో అటవీ ప్రాంతంలో పరుగులు తీసిండు. కఠినమైన పరిస్థుతుల్లో పరుగు పందెం కావడం, ఎత్తు పల్లాలు మధ్యలో పరిగెత్తడంతో మోకాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పడుతున్నా, వాటిని అన్నింటినీ తట్టుకుంటూ టాటా ఆల్ట్రా మారాథోన్ రన్ ను పూర్తి చేశామని వెల్లడించారు. ఈ రన్ లో ప్రపంచ నలుమూలల నుండి అనేక మంది పాల్గొనటం విశేషం. అదేవిధంగా .. ఈ నెల 2వ తారీఖున ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో విజయవాడ నందు కృష్ణా రివర్ క్రాస్ ఈత పోటీలలో 1.5 కిలోమీటర్స్ ను 26 నిముషాలు 8 సెకండ్స్ లో రాజు ఈది పతకం సాధించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీ సుశీల్ సింగ్, ఏసీపీ నర్సయ, ఆర్ఐ అప్పలనాయిడు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments