
సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్*
పయనించే సూర్యుడు మార్చి 2 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు . వార్త విశ్లేష భద్రాద్రి కొత్తగూడెం సదరన్ క్యాంపు ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు సోలార్ ప్లాంట్ల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు డిఆర్ఓ డి డబ్ల్యూ ఓ డి సి హెచ్ ఎస్ జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ లతో సేర్పు సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సేఫ్ సీఈవో మాట్లాడుతూ సదరం ధ్రువీకరణ పత్రాల కోసం యు డి ఐ డి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా దివ్యాంగులకు అవగాహన కల్పించాలన్నారు గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ వీఎల్ఈ కేంద్రాలను ఆశ్రయించే వారని ఇప్పుడు వీటితోపాటు యుడిఐడి పోర్టల్ సొంత మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ మరియు స్లాట్లు చేసుకోవచ్చని ఆమె తెలిపారు క్యాంపుల వివరాలు కూడా సందేశం మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ ప్రక్రియను మార్చి 2025 మాసం నుండి అమలులోకి తీసుకురావడం జరిగిందని 21 రకాల వైకల్యం కలిగిన వారు యూడిఐడి యూనిట్ డిజాబిలిటీ ఐడి కార్డును పొందవచ్చు అని ఆమె తెలిపారు సదరం కార్డును కూడా పోస్టల్ ద్వారా అభ్యర్థులకు చేరవేయడం జరుగుతుందని ఆమె అన్నారు గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కలిగి ఉన్నవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని వారికి ప్రస్తుతం ప్రభుత్వ పరంగా అందుతున్న పథకాలు వర్తిస్తాయని ఆమె పేర్కొన్నారు దివ్యాంగులు ఎలాంటి అపోహలకు గురికాకుండా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు రాష్ట్రంలో సదరన్ క్యాంపులను నిర్వహించేందుకు 38 మెడికల్ బోర్డులను గుర్తించడం జరిగిందని ఆమె తెలిపారు సదరం క్యాంపు నిర్వహించే సందర్భాలలో దివ్యాంగులకు అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు నిమిత్తం రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంపై మీసేవ నిర్వాహకులకు శిక్షణ ఇవ్వాలనిసెర్ప్ సీఈవో దివ్య దేవరాజను అధికారులకు సూచించారు పీఎం కోసం ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ ప్లాంటులను ఏర్పాటు చేసుకునేందుకు గ్రామీణ మహిళా సంఘాలను ప్రోత్సహించాలని తెలిపారు సర్ఫు దివ్య దేవరాజన్ తెలిపారు ఆసక్తి ఉన్నవారు నుండి దరఖాస్తులు స్వీకరించి స్థలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు ఐడి ఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్య చందన ఆర్ ఎం ఓ రమేష్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు