
పయనించే సూర్యుడు మార్చి 3 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి చిన్నారులను ఆశీర్వదించిన దైవజ్ఞశర్మ ఆకట్టుకున్న బిందు మాధవి, భావన కూచిపూడి నృత్యం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కూచిపూడి నృత్య కళా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఆదివారం అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. నగరంలోని బిర్లా భాస్కర ఆడిటోరియంలో కళాకర్ తెలుగు టీవీ, శివనంది అవార్డ్స్ 2025 ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నృత్య పోటీలలో హైదర్ నగర్ లోని రుహాని కూచిపూడి నృత్య అకాడమీ నిర్వాహకురాలు నేరెళ్ల కల్పన ఆధ్వర్యంలో నిర్వహించిన బిందు మాధవి, భావనల తోపాటు పలువురు చిన్నారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కూచిపూడి నృత్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు దైవజ్ఞ శర్మ అవార్డులు ప్రధానం చేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సంస్కృతిక కళలను భావితరాలకు అందించడానికి తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువారిపై ఉందన్నారు. చిన్న వయస్సులోనే అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రుహనా కూచిపూడి నృత్య అకాడమీ బృందాన్ని ఆయన ఆశీర్వదించారు. కూచిపూడి నృత్యాన్ని ప్రోత్సహిస్తున్న రుహాన కూచిపూడి నృత్య అకాడమీ నిర్వాహకులను ఆయన అభినందించారు. చిన్నారులు తమ వయస్సుతో సంబంధం లేకుండా అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రదర్శించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాఖర్ తెలుగు టీవీ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.