
పయనించే సూర్యుడు: మార్చి04: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం పేరూరు ఉపకేంద్రం పరిధిలోని గర్భవతులకు నర్సింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలోఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ల్యాబ్ టెక్నీషియన్ ఆధ్వర్యంలో పరీక్షలుచేశారు.అనంతరం రక్తం తక్కువ గా ఉన్న గర్భవతులను గుర్తించి 5నెలలు దాటిన గర్భవతులకు ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్ పెట్టడం జరిగినది. ప్రమాద భరిత లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా! ప్రమాద భరిత లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలను ఆరోగ్య విద్యా బోధనలు ద్వారా తెలియజేశారు. అలాగే, గర్భస్త కాలంలో తీసుకోవలసిన ఆహారం గురించి,చేయవలసిన వ్యాయామం గురించి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినదనితెలిపారు. ఈయొక్క కార్యక్రమంలో హెచ్ఈఓ వేణుగోపాలకృష్ణ,నర్సింగ్ ఆఫీసర్ రమ మరియు రమాదేవి, ఏఎన్ఎం,శకుంతల , ల్యాబ్ టెక్నీషియన్ అశ్విని మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
