
పయనించే సూర్యుడు. మార్చి 4. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
అఖిలపక్ష రైతు సంఘాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న లకావత్ గిరిబాబు రైతులు పండించిన మిర్చి పంటకి గిట్టుబాటు ధర లేక అపసోపాలు పడుతున్న రైతన్నకి మేమున్నామంటూ ధైర్యాన్ని ఇవ్వడానికి నేడు ఖమ్మం జిల్లాలో అఖిలపక్ష రైతు సంఘాలు ఏర్పాటు చేసిన రైతులు ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధు గారు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కొండబాల కోటేశ్వరరావు గారు, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు ధర్నాలో పాల్గొన్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు. వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ రైతు ధర్నా అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మిర్చి రైతులను ఆదుకోవాలని గతంలో క్వింటాలుకు 25 వేల నుంచి వెళ్లి 30000 పలికిన ధర నేడు పదివేలకు పడిపోవడం వల్ల మిర్చి రైతులు అన్నమో రామచంద్రా అంటూ ఆవేదన చెందుతున్నారు. రైతులు పండించిన పంటకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ 25వేల రూపాయలు చెల్లించే విధంగా బాధ్యత చర్యలు చేపట్టాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో పేజి నెంబర్ 9 లోని నాడు మిర్చి రైతులకు రూ. 15000 తగ్గకుండా పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి నేడు విస్మరించడం, రైతులను నట్టేట ముంచడమే. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మిర్చి రైతుల గిట్టుబాటు లేకపోవడం పై రివ్యూ నిర్వహిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం పాలనపై సోయిలేఖ తన రాజకీయాల కోసం ఎన్నికల్లో ప్రచారాలు చేస్తూ కాలం గడుపుతున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి తెలంగాణ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.
