
- పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 7:-రిపోర్టర్ (కే శివకృష్ణ) బాపట్ల పురపాలక సంఘ కార్యాలయము కమిషనర్ ఛాంబర్ నందు ఈరోజు ఉదయం సచివాలయ పారిశుద్ధ్య కార్యదర్శులతో మునిసిపల్ కమిషనర్ జి.రఘునాథ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో భాగంగా ప్రభుత్వం ఈ మాసమునకు సంబంధించి సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం అనే అంశమును థీమ్ గా నిర్ణయించినది. ఇదే అంశముపైన రేపు అనగా శుక్రవారం పురపాలక సంఘ పరిధిలోని అన్ని పాఠశాలలోని 6,7 తరగతుల వారికి జూనియర్ విభాగంలో, 8,9 తరగతుల వారికి సీనియర్ విభాగంలో వకృత్వ పోటీలు, మరియు వాగ్చాతుర్య పోటీలు సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంశముపై రేపు శుక్రవారం పురపాలక సంఘ ఉన్నత పాఠశాల నందు నిర్వహించబడతాయని కమిషనర్ అన్నారు. ఇదే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంశము పైన సోమవారం పట్టణంలోని స్వయం సహాయక గ్రూపుల వారితో, మంగళవారం N.G.O. లతో అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుందని కమీషనర్ అన్నారు. ఈ సమావేశంలో సచివాలయ పారిశుద్ధ్య కార్యదర్శులు,పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.