Thursday, March 6, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆదివాసి ఎరుకల పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ఆదివాసి ఎరుకల పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

Listen to this article
  • అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులు విడుదల చేయండి
  • తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు

పయనించే సూర్యడు // మార్చ్ // 6 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. హుజురాబాద్ ఆదివాసి ఎరుకల పేద విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు దూరం చేస్తుందని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూతాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంకరపట్నం మండలం కేంద్రంలో వరంగల్, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మాట్లాడుతూ..తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసి ఎరుకల విద్యార్థి విద్యార్థులు మరియు ఇతర గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న బాధలను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం విదేశీ విద్యను అభ్యసించడానికి తల్లిదండ్రులు అప్పులు చేసి విదేశాలకు పంపిస్తే, ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ సకాలంలో విడుదల చేయకపోవడం వలన తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ పేద విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మనసు రావడం లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి తక్షణమే నిధులు విడుదల చేయాలని, లేదంటే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఖరిని ఎండకట్టి ప్రజలలో తీసుకెళ్తామని రాజు పేర్కొన్నారు.హైదరాబాద్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్యను దూరం చేస్తున్నదని ఆరోపించారు. ఫీజు రియంబర్స్ మెంట్ నిధులను కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎంపికై వివిధ దేశాలల్లో చదువుకుంటున్న ఆదివాసి ఎరుకల విద్యార్థులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో మాట్లాడడం జరిగిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో సదుద్దేశంతో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసి గిరిజన పేద విద్యార్థులకు కూడా విదేశీ విద్య అందాలన్నది కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం ఉద్దేశాలకు తూట్లు పొడుస్తున్నదని గుర్తు చేశారు. రెండో విడత నిధులను ఎందుకు విడుదల చేయడం లేదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన పేద విద్యార్థులను ప్రభుత్వం ఎందుకు చులకనగా చూస్తున్నదని నిలదీశారు. స్కాలర్ షిప్ అందక అనేక ఆదివాసి గిరిజన పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, స్కాలర్ షిప్స్ విడుదల కోసం తల్లిదండ్రులు, విద్యార్థులు వేచి చూస్తున్నారని పేర్కొన్నారు.
కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ గిరిజన బడ్జెట్ నుంచి విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ మాత్రమే కాకుండా ఇతర స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆదివాసి గిరిజన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పడుతున్న బాధలను కష్టాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఖరిని ఎండకట్టి నిధులను విడుదల చేయించుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కోనేటి రాజు, కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవెల్లి రాజలింగం, జిల్లా ఉపాధ్యక్షులు బండి సమ్మయ్య, కుతాడి కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాడి తిరుపతి, జిల్లా కోశాధికారి మానుపాటి మల్లేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ జిల్లా అధ్యక్షులు కేతిరి రాజశేఖర్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓని సదానందం, పాలకుర్తి నారాయణ, హనుమకొండ జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్, కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కేతిరి సుభాష్, యూత్ అధ్యక్షులు అంగడి ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షులు దుగ్యాల రాము, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్, పెద్దపల్లి పట్టణం అధ్యక్షులు మానుపాటి ఎల్లయ్య మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దుగ్యాల బాపు, ప్రధాన కార్యదర్శి లోకి రవి, ములుగు జిల్లా అధ్యక్షులు కేతిరి బిక్షపతి, ప్రధాన కార్యదర్శి పల్లకొండ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments