
పయనించే సూర్యడు: మార్చి 06: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ. వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రగల్లపల్లి కట్ట కట్టమైసమ్మ ఆలయంలో నేడు ఒక ప్రేమ జంట వివాహం చేసుకొన్నారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ ములుగు జిల్లా వాజేడు మండలం ప్రాంతానికి చెందిన అరుణాచలం గ్రామ యువకుడు చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన బీజాపూర్ జిల్లా మద్ద్దేడ్ పరిధిలోని గెర్రగుడుం గ్రామానికి చెందిన కాసర్ల భాగ్యవతి అనే యువతి తో నేడు ప్రగాళ్లపల్లి కట్ట మైసమ్మ ఆలయంలో ప్రేమవివాహం చేసుకున్నారు. ఈసందర్భంగా ప్రేమ జంట మాట్లాడుతూ మా యొక్క ప్రేమ వివాహానికి ప్రతీ ఒక్కరు సహకరించగలరు అని తెలియజేశారు. అంతే కాకుండా మా వివాహం పెద్దలకి కులానికి విరుద్ధంగా జరిగిందని కాబట్టీ పరిధిలోని పోలీసు శాఖ వారు మాకు రక్షణ కల్పించగలరని కోరారు. మా యొక్క వివాహానికి ఎటువంటి ఎవరికి మధ్యవర్తులు లేరని తెలియజేశారు అంతేకాకుండా మాకు ప్రాణహాని ఉన్నదని తగిన రక్షణ కల్పించాలని పత్రికా ముఖంగా వేడుకుంటామని తెలియజేశారు.
