
పయనించే సూర్యుడు మార్చి 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో స్థానిక గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం రైతులకు అవగాహన కల్పించడం జరిగింది చేజర్ల మండల అధికారులు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు రావి లక్ష్మీనరసారెడ్డి పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి .నారా చంద్రబాబునాయుడు ,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. కింజరాపు అచ్చెన్నాయుడు . స్థానిక శాసన సభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్నిరకాలసదుపాయాలు అందుబాటులో ఉన్నాయని రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శశిధర్. తాసిల్దార్ మురళి. మండల అభివృద్ధి అధికారి. విజయ లలిత. టీడీపీ నాయకులు సోమశిల కాలువ 24L చైర్మన్ ఉడతా హాజరత్తయ్య బీజేపీ నాయకులు బత్తల కృష్ణయ్య ,బీజేపీ నాయకులు,టీడీపీ నాయకులు,రైతులు పాల్గొన్నారు
