
పయనించే సూర్యుడు బాపట్ల మార్చ్ 8:- రిపోర్టర్ (కే శివకృష్ణ ) బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని 10 వ వార్డు ప్యాడిసన్ పేట నందు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ” ఫ్రైడే – డ్రైడే ” కార్యక్రమమును మునిసిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీతో ప్రారంభించారు. వార్డు మొత్తం తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రజలు గృహ పరిసరాలను ఎప్పుడు కూడాను శుభ్రం గా ఉంచుకోవాలని, ఇంట్లో పనికి రాకుండా ఉపయోగములోలేని పాత టైర్ లు,పాత కూలర్ లు, తాగి పారేసిన కొబ్బరి బొండాలు,ఉపయోగములో లేని బావుల, నీటి తొట్టెల నందు దోమలు మరియు దోమల లార్వా అధికంగా ఉత్పత్తి అవుతుందని వాటిని గుర్తించి తొలగించాలని అయన అన్నారు. ఈ పైవాటిని తొలగించడం ద్వారా తగు జాగ్రత్తలు పాటించి డెంగ్యూ మలేరియా లాంటి భయంకరమైన జ్వరాలు వ్యాదుల నుండి రక్షణ పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్
శ్రీ.డి. శ్రీనివాసరావు , మెప్మా సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.