
- ధర్మ సమాజ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మందరాజు మహారాజ్ డిమాండ్..
పయనించే సూర్యడు // మార్చ్ // 8 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నగునూరు గ్రామంలో కొందరు వ్యక్తులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కి చెప్పులదండా వేసి అవమానపరిచారన్నారు , ఇలాంటి చర్య దేశానికి యావత్ సమాజానికి అవమానపర్చడమేనని ధర్మ సమాజ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మంద రాజ్ మహారాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇలాంటి చర్య చేసిన వారు వెనకాల ఎవరు ఉన్నా అరెస్ట్ చేసి దేశద్రోహం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేసారు.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతి గ్రామంలో ప్రతిష్టించల్సింది పోయి, ఇలా విగ్రహాలను అవమానపరచడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని, రాష్ట్రంలో ఉన్న ప్రతి అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రభుత్వం సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.