
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన చేజర్ల వెలుగు ఆఫీస్ కార్యాలయం నందు శనివారం మహిళలకు ఆటలపోటీలు నిర్వహించడం జరిగింది . ఈ ఆటల పోటీలకు వివోఏలు,వివో అధ్యక్షులు, మహిళలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మండల అభివృద్ధి అధికారి విజయ లలిత. తాసిల్దార్ మురళి. మండల అధ్యక్షులు తూమాటి విజయభాస్కర్ రెడ్డి , మండల టిడిపి అధ్యక్షులు రావి లక్ష్మీనరసారెడ్డి మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొని అధికారులు ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఏపిఎం సులోచన తెలిపారు ఈ కార్యక్రమంలో వివో ఏలు. సీసీలు. వెలుగు సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు
