
పయనించే సూర్యుడు మార్చి08 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు కోర్టు ఆవరణలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆర్యవైశ్య మహాసభ, వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ కేసులలో హాజరైన కక్షిదారులకు ఇల్లందు కోర్టు జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కీర్తి చంద్రిక రెడ్డి , డి.ఎస్.పి. చంద్ర భాను చేతుల మీదుగా పులిహార ప్యాకెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెజిస్ట్రేట్ కీర్తి చంద్రిక రెడ్డి మాట్లాడుతూ. మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయాలని పేర్కొన్నారు.సమాజంలోని అవకాశాలను అందుకుని ఆదర్శవంతంగా నిలవాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ. బత్తుల సత్యనారాయణ , న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి కుమార్ , ఉమామహేశ్వరరావు , జాయింట్ సెక్రెటరీ కీర్తి కార్తిక్ , మాజీ ఏజీపీ కలవల సుధాకర్ , దంతాల ఆనంద్, ఆర్యవైశ్య మహాసభ మండల, యువజన సంఘం అధ్యక్షులు ప్రొద్దుటూరి నాగేశ్వరరావు, నరేంద్రుల అను బాబు, వాసవి క్లబ్ అధ్యక్షుడు భోనగిరి రవి కిరణ్ సత్యధ ర్ నాగరాజు, పోలీస్ శాఖ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.