
పయనించేసూర్యుడు మార్చి 8 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు రాయచోటి సమ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ మరియు రాయచోటి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వరప్రసాద్ సూచనల మేరకు ఈ దినం అనగా 08.03.2025 నాడు సుండుపల్లి ఎస్సై ముత్యాల శ్రీనివాసులు మరియు హెడ్ కానిస్టేబుల్ బి డి నాయక్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ హోంగార్డు జిలాని భాష మరియు సి పి ఓ కలిసి సుండుపల్లి మండలం తూర్పు మాలపల్లి సమీపంలో సిద్ధంగా ఉంచిన 300 లీటర్ల ఎఫ్ జె వాష్ ను ధ్వంసం చేయడం జరిగినది.
ఎవరైనా సరే మండలంలో నాటు సారా కాంచన, అమ్మిన చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలపడం జరిగినది.