
మెప్మా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడపయనించే సూర్యుడు బాపట్ల మార్చి 9 రిపోర్టర్ కే శివకృష్ణ మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుందని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక మునిసిపల్ కార్యాలయంలో వద్ద మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకకు ముఖ్య అతిధిగా చీరాల శాసనసభ్యులు *శ్రీ మద్దులూరి మాలకొండయ్య ధర్మపత్ని బాలకొండమ్మ హాజరయ్యారు.. మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పొదుపు సంఘాల ద్వారా ప్రభుత్వం రుణాలు అందిస్తుందన్నారు. అంతే కాకుండా శక్తి యాప్ ప్రభుత్వం ఏర్పాటు చేసి మహిళాల అభివృద్ధికి అనుగుణంగా వివిధ రంగాలలో శిక్షణ ఇస్తుందని. నియోజకవర్గం అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. అనంతరం 126 మెప్మా గ్రూప్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ.3.80 కోట్ల చెక్కు పంపిణీ చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య అందచేశారు. ప్రతిభ కనపరిచిన ఆర్పి లకు ప్రశంసా పత్రం అందజేశారు, కార్యక్రమం లో హ్యాండ్లూమ్ చైర్మన్ డాక్టర్ సజ్జా హేమలత, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, సీఎంఎం కొండయ్య, కూటమి మహిళా నాయకురాలు, మున్సిపల్ కౌన్సిలర్లు, తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు నాయకురాలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.