
పయనం చేసి చూడు బాపట్ల మార్చి 11:- రిపోర్టర్ (కే. శివ కృష్ణ)
బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని వార్డుల నందు ఈరోజు ఉదయం మునిసిపల్ కమిషనర్.జి.రఘునాథ రెడ్డి పర్యటించారు. స్థానిక
సి.బి.జెడ్.చర్చి వద్ద పారిశుధ్య కార్మికుల హాజరు పట్టికను తనిఖీ చేసిన ఆయన, కార్మికులతో మాట్లాడి వార్డుల నందు ప్రతిరోజు నిర్వహిస్తున్న పారిశుధ్యం పై నేరుగా వారినే వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల నందు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. పారిశుధ్యం మెరుగుదలకు తీసుకోవలసిన చర్యలను గురించి ప్రజారోగ్య విభాగ అధికారులతో మాట్లాడారు. పట్టణంలో పారిశుద్ధ్యం విషయంలో అలసత్వం వహించవద్దని సిబ్బందికి సూచించారు. త్రాగునీటి సరఫరా గురించి అసిస్టెంట్ ఇంజనీర్ వారితో మాట్లాడారు, వార్డుల నందు స్వయంగా తిరిగి త్రాగునీటి సరఫరా గురించి ప్రజలనే అడిగి వివరాలు తెలుసుకున్నారు.లీకులను గుర్తించి సత్వరమే వాటిని బాగు చేయాలని సూచించారు.ప్రతిరోజు సాంకేతిక పరీక్షలు ల్యాబ్ నందు చేసిన తదుపరి పూర్తి సురక్షితమని నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే పట్టణానికి త్రాగునీటి సరఫరా చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.అనంతరం సూర్యలంక రోడ్డు లోని గాయత్రి అపార్ట్మెంటు వద్ద చెత్త లోడింగ్ పాయింట్ ను పరిశీలించారు.రోడ్లపై ఎక్కడా కూడాను చెత్త నిల్వలు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. రోడ్లపై మరియు రోడ్ల మార్జిన్ లపై చెత్త నిల్వలు లేకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప కంచె మెష్ ల నందు మాత్రమే చెత్త డబ్బాలను ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులకు చెప్పారు. అనంతరం ఇమ్మడిశెట్టి వారి పాలెం సచివాలయం ముందు సందర్శించిన ఆయన P4 సర్వే ను గురించి సచివాలయ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ పరిశీలించిన ఆయన, క్యాంటీన్ పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలకు అందించాలని క్యాంటీన్ సిబ్బందికి సూచించారు. అనంతరం పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కు సుందరీకరణ పనులను పరిశీలించారు.వారి వెంట అసిస్టెంట్ ఇంజనీర్ జి.ప్రసాద్, పురపాలక సంఘ సిబ్బంది,సచివాలయ సిబ్బంది ఉన్నారు.