
జనం న్యూస్ మార్చి 12 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ముమ్మిడివరంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల బిల్డింగ్ లు నిర్మాణం కొరకు ప్రస్తుతం ఉన్న జూనియర్ కళాశాల ప్రాంగణంలో గల ఎ 3.20 సెంట్లు భూమిని ప్రభుత్వం కేటాయిస్తూ GO 84 జారీ చేయడం జరిగినదని ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు తెలియచేసారు, గత 2 సం.లుగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్య గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేశ్ గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఆయన స్పందించి ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టిలో పెట్టడం జరిగినదని తెలియచేసారు. ఈ ఉత్తర్వులు వెలువడడం తో త్వరలో డిగ్రీ కాలేజీ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియచేసారు.