
పయనించే సూర్యుడు గాంధారి 13/03/25 కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్టం పేరు మీద ఉన్న తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు కోసం జరిచేసిన సరక్యూలర్ ను వెనక్కి తీసుకోవాలని పి డి యస్ యు జిల్లా అధ్యక్షులు సతీష్ డిమాండ్ చేశారు ఈ సందర్బంగా సతీష్ మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్టం తెలంగాణ పేరు మీద ఉన్న ఏకైక యూనివర్సిటీ నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ పేరు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం సరక్యులర్ జరిచేసిందన్నారు ఆ సరక్యులర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు లేని పక్షంలో పి డి ఎస్ యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు అలాగే ఉమ్మడి జిల్లలోని ప్రజాప్రతినిధులు యూనివర్సిటీ పేరు మార్చే సరక్యులర్ ను వెనక్కు తీసుకునేవిధంగా ప్రభుత్వం పై పోరాడాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మోజీ రామ్ నాయకులు సుమన్, నగేష్ తదితరులు పాల్గొన్నారు