
పదవ తరగతి విద్యార్థులకు రైటింగ్ ఫ్యాడ్ పెన్ వితరణ.
ముఖ్య అతిథులుగా హజరైన మండల విద్యా శాఖ అధికారి మనోహర్ గారు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పవన్ చౌహన్.
ప్రతి ఒక్క విద్యార్థులు బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు పూలే సావిత్రిబాయి అడుగుజాడల్లో నడవాలి
( పయనించే సూర్యుడు మార్చి 14 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్ )
షాద్ నగర్/ఫరూక్ నగర్:మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు మండల విద్యా శాఖ అధికారి టి.మనోహర్,ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్..గురువారం ఫరూక్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సీ ఎస్టీ, హాస్టల్,ఫరూక్ నగర్ పదవ తరగతి పరీక్షలు రాసే బాలుర,బాలికలకు ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పవన్ చౌహన్ లతో కలిసి మండల విద్యా శాఖ అధికారి రైటింగ్ ఫ్యాడ్స్,పెన్నులను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ,,, రాబోయే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు అందరూ పరీక్షలు బాగా రాసి అందరూ ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.విద్యార్థుల కోసం,విద్యా వ్యవస్థ కోసం ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఆకాష్ నాయక్ చేస్తున్న సేవలను మండల విద్యా శాఖ అధికారి, మనోహర్ జిల్లా (ఏఐఎస్ఎఫ్) అధ్యక్షులు పవన్ చౌహన్ కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు శైలజ,శంకరయ్య,తిరుపతిరెడ్డి,ఉపాధ్యాయుల బృందం, ఏఐఎస్ఎఫ్ నాయకులు, శ్రీను, అరుణ్, రాజేష్, సునీల్, చందు, తదితరులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు…